Billionaires: మన దేశంలో గత మూడేళ్ళలో భారీగా పెరిగిన కోటీశ్వరులు..!

by Maddikunta Saikiran |
Billionaires: మన దేశంలో గత మూడేళ్ళలో భారీగా పెరిగిన కోటీశ్వరులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్(Covid) వంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత కూడా మన దేశ ఆర్థిక పరిస్థితి(Financial situation) స్ట్రాంగ్ గా నిలబడింది. దేశంలో రూ.కోటికి పైగా ఆదాయం సంపాదిస్తున్న వారు గత మూడేళ్లలో భారీగా పెరిగారు. ఆదాయపు పన్ను శాఖ(IT Department) తెలిపిన సమాచారం ప్రకారం 2024-25లో రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న వాళ్ల సంఖ్య 2.20 లక్షలకు పైగా పెరిగింది. పదేళ్లలోనే వీరు 5 రెట్లు పెరిగారు. గత మూడు ఆర్ధిక సంవత్సరాల్లోనే కొత్తగా లక్షమంది కోటీశ్వరుల జాబితాలో చేరడం విశేషం. దేశంలో కోటీశ్వరులు పెరగడానికి వివిధ కారణాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చాలామంది స్టాక్ మార్కెట్లో(Stock Market) డబ్బు సంపాదించడం , స్టార్టప్ కంపెనీ(Startup Company)లు లాభాలను ఆర్జించడం, ఇక ఐటీ సంస్థలు(IT organizations) ప్రతిభావంతులకు ఎక్కువ శాలరీస్ ఇవ్వడం వంటివి కోటీశ్వరులు పెరగడానికి ఓ కారణమని తెలిపారు. కోటీశ్వరులు పెరగడంలో యూనికార్న్ కంపెనీల(Unicorn Companies) పాత్ర కూడా ఉందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed