CBI Recruitment: సీబీఐలో అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఉద్యోగ అవకాశాలు.. అర్హత, పోస్టుల వివరాలివే..!

by Maddikunta Saikiran |
CBI Recruitment: సీబీఐలో అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఉద్యోగ అవకాశాలు.. అర్హత, పోస్టుల వివరాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: మీరు బీఈ(BE )/ బీటెక్(B.Tech) పూర్తి చేసి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే మీకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) గుడ్ న్యూస్ చెప్పింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI)లో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 అసిస్టెంట్ ప్రోగ్రామర్(Assistant Programmer) పోస్టులను ఓపెన్ భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.upsconline.nic.in ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 28 నవంబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

అసిస్టెంట్ ప్రోగ్రామర్ - 27

విద్యార్హత:

సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్(కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

29 నవంబర్ 2024 నాటికి అన్ రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 ఏళ్లు, ఓబీసీలకు 33 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లకు మించి ఉండకూడదు.

ఎంపిక ప్రక్రియ:

రిక్రూట్‌మెంట్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 25, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed