- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TTDP: మెంబర్‌షిప్‌ను యజ్ఞంలా చేద్దాం.. పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్‌గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీ మెంబర్‌షిప్(Party Membership) కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేద్దామని పొలిట్‌బ్యూరో సభ్యుడు(Polit Buro Member) అరవింద్ కుమార్‌గౌడ్(Aravind Kumar Goud) పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్(NTR Bhavan) లో పార్లమెంట్ పార్టీ అడ్‌హాక్ కమిటీ(Parliament Party Ad Hoc Committee) సభ్యుల సమావేశం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చ, పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారు తదితర అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని ఎన్‌టీఆర్(NTR) తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)ని స్థాపించారన్నారు. సామాజిక న్యాయం పునాది మీద ఆవిర్భవించిన పార్టీ టీడీపీ అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు(CM Chandrababu) సంస్కరణలను తీసుకొచ్చి యువతకు, మహిళలకు అవకాశాలు కల్పించారన్నారు.
తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు కారణమని, పార్టీ కార్యకర్తలకు ప్రజల్లో గౌరవం ఉందన్నారు. నారా లోకేష్(Lokesh Nara) కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసే ఆలోచన చేయడం అభినందనీయం అన్నారు. టీడీపీని ఆదర్శంగా తీసుకుని ఇతర పార్టీలు ఇన్సూరెన్స్(Insurance)ను ప్రారంభించాయన్నారు. నేతల నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి మెంబర్‌షిప్ ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో పార్టీ బలగాన్ని మెంబర్‌షిప్ ద్వారా తయారు చేసుకుందామని పిలుపు నిచ్చారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదును చేయించాలన్నారు. కష్టపడి పని చేసివారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, నాయకులు రాంమోహన్, బంటు వెంకటేశ్వర్లు, నన్నూరి నర్సిరెడ్డి, సామ భూపాల్ రెడ్డి, కూరపాటి వెంకటేశ్వర్లు, కందికంటి అశోక్ కుమార్ గౌడ్, కనగాల సాంబశివరావు, బండి పుల్లయ్య, గుళ్లపల్లి ఆనంద్, కట్టా వెంకటేష్ గౌడ్, టీడీపీ ప్రకాశ్ రెడ్డి, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.