Varun Tej: రామ్ చరణ్ నా భుజం మీద చెయ్యి వేస్తే చాలు.. అదే నాకు వెయ్యి కోట్లు (వీడియో)

by Gantepaka Srikanth |
Varun Tej: రామ్ చరణ్ నా భుజం మీద చెయ్యి వేస్తే చాలు.. అదే నాకు వెయ్యి కోట్లు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ప్రధాన పాత్రలో నటించిన మట్కా చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్ వైజాగ్‌లో గ్రాండ్‌ జరిగింది. ఈ వేడుకకు మెగా అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), తన తండ్రి నాగబాబు(Naga Babu) లేకపోతే తాను లేను అని ఎమోషనల్ అయ్యారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చానో, ఎవరి వేసిన రూట్‌లో నడుస్తున్నానో మర్చిపోను అని అన్నారు. ‘ఎప్పుడైనా బాధగా అనిపించినా, సినిమా విషయంలో టెన్షన్‌గా ఉన్న నా సోదరుడు రామ్ చరణ్ నా భుజం మీద చెయ్యి వేస్తే చాలా ధైర్యంగా ఉంటుంది.

అదే నాకు వెయ్యి కోట్లు’ అని వరుణ్ తేజ్(Varun Tej) అన్నారు. అనేక సందర్భాల్లో రామ్ చరణ్(Ram Charan) తనకు సపోర్ట్‌గా నిలిచారని గుర్తుచేశారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. నవంబర్ 14న ‘మట్కా’ ప్రేక్షకులు ముందుకు రానుంది.



Advertisement

Next Story