Big Boss-8 : బిగ్ బాస్ నుంచి హరితేజ ఔట్

by M.Rajitha |
Big Boss-8 : బిగ్ బాస్ నుంచి హరితేజ ఔట్
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్-8(Big Boss-8) నుంచి హరితేజ ఎలిమినేట్(Hariteja Eliminated) అయ్యారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ సీజన్లోకి అడుగుపెట్టిన హరితేజ.. అతితక్కువ ఓట్లు రావడంతో బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్తున్నట్టు హోస్ట్ నాగార్జున(Nagarjuna) ప్రకటించారు. ఈ వారం నామినేషన్స్ లో యష్మి, ప్రేరణ, గౌతమ్, హరితేజ, విష్ణుప్రియ, రోహిణి, పృథ్వీ, నిఖిల్ ఉన్నారు. నామినేషన్స్ చివరి వరకు హరితేజ, యష్మి ఉండగా.. ఓట్లు తక్కువ వచ్చిన కారణంగా హరితేజ ఎలిమినేట్ అయ్యారు. అయితే అనారోగ్య కారణాలతో ఈ వారం గంగవ్వ(Gangavva) కూడా ఇంటినుంచి బయటకి వెళ్తున్నట్టు నాగార్జున ప్రకటించారు.

Advertisement

Next Story