సీఆర్టీలకు జీతాలు చెల్లించడం లేదని వినూత్న నిరసన

by Aamani |
సీఆర్టీలకు జీతాలు చెల్లించడం లేదని వినూత్న నిరసన
X

దిశ, ఉట్నూర్ : ఐటీడీఏ పరిధిలోని అన్ని ఆశ్రమాల్లో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్టీలకు ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని ఐటీడీఏ ముందు సమ్మె చేస్తున్న సీఆర్టీలు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఆర్టీల సంఘం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దులాల్ మాట్లాడుతూ జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా వినూత్నంగా ఆలోచించి విరాళాలను సేకరణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న 5 నెలల వేతనాలు, 6 నెలల ఏరియర్స్ వెంటనే రిలీజ్ చేసి, ప్రతి నెల నెల 1న జీతాలు చెల్లించే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed