Harish Rao: ‘యూజ్ లెస్ ఫెలో..’ సభలో హరీశ్ రావు వ్యాఖ్యలపై దుమారం

by Prasad Jukanti |
Harish Rao: ‘యూజ్ లెస్ ఫెలో..’ సభలో హరీశ్ రావు వ్యాఖ్యలపై దుమారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సభలో హరీశ్ రావు వ్యాఖ్యలపై గందరగోళం ఏర్పడింది. రాష్ట్ర రుణాలపై స్వల్ప కాలిక చర్చ సమయంలో 'ఎవడయ్యా యూజ్ లెస్ ఫెలో దొంగ అన్నది' (use less fellow comments) అని హరీశ్ రావు (harish rao) అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నన్ను దొంగ అంటే నేను యూజ్ లెస్ ఫెలో అన్నాను ఇది తప్పా? వాళ్లు అనవద్దు కదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. దీంతో గందరగోళం మరింతగా పెరిగింది. ఈ క్రమంలో మాట్లాడిన శ్రీధర్ బాబు.. కాంగ్రెస్ సభ్యులు మాట్లాడింది మైక్ లో మాట్లాడలేదని అది ఎవరికి వినబడలేదని కానీ హరీశ్ రావు మైక్ లో మాట్లాడింది అందరికీ వినిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనను దొంగ అంటేనే నేను అలా అన్నానని తనను అన్న సభ్యుడిని శ్రీధర్ బాబు (Shridhar Babu) సమర్థిస్తారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. తనపై రన్నింగ్ కామెంటరీ చేసిన సభ్యుడిని నేను అన్నానన్నారు. ఈ క్రమంలో 'రాజగోపాల్ రెడ్డి (rajagopal reddy) మీరు హోమ్ మినిస్టర్ అయ్యాక మైక్ ఇస్తారని. ఇప్పుడు మీకు హెలిజిబులిటి లేదన్నారు. మీరు హోం మంత్రి కావాలి. ఐ విష్ యూ షుడ్ హోమ్ మినిస్టర్ అని హరీశ్ రావు అన్నారు. సభను నడిపే పద్దతి ఇది కాదన్నారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి.. హరీశ్ రావుతో సీనియర్ సభ్యుడు. ఆయన నాకు వ్యక్తిగతంగా దగ్గరి మిత్రుడు. ఆన్ రికార్డు మైక్ లో ఓ సభ్యుడిని యూజ్ లెస్ ఫెలో అనడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే మీరు జీర్ణించుకోవడం లేదు. ఇక్కడ మాట్లాడేదంతా తెలంగాణ ప్రజలు వింటున్నారు. మేమే అధికారంలో ఉంటామని మీరనుకున్నారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. సీఎం నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుడిని పట్టుకుని అలా మాట్లాడుతున్న హరీశ్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక మీ ఆటలు సాగవని.. హరీశ్ రావుకు ఏమాత్రం ఈ సభపై, సభ్యుల గౌరవం, తెలంగాణ ప్రజలపై గౌరవం ఉన్నా బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఈ మాట మరో కొత్త సభ్యుడెవరైనా అంటే పోనిలే అనుకునేవాళ్లం కానీ హరీశ్ రావు లాంటి సీనియర్ సభ్యుడు ఇలాంటి మాట్లాడటం బాధకరం అన్నారు. కాగా హరీశ్ రావు వ్యాఖ్యలను స్పీకర్ రికార్డులో నుంచి తొలగించారు.

Advertisement

Next Story

Most Viewed