చోరీ కేసులో వ్యక్తి అరెస్టు.. రిమాండ్ కు తరలింపు

by Naveena |
చోరీ కేసులో వ్యక్తి అరెస్టు.. రిమాండ్ కు తరలింపు
X

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన ఓ వ్యక్తి పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం..ఎల్లారెడ్డి మండల కేంద్రంలో డిసెంబర్ 16న మహమ్మద్ ఫరూక్ అహ్మద్ ఇంటి ముందు ఉన్న గోదాం నుంచి సుమారు రూ. 50,000 విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఫరూక్ అహ్మద్ గోదాం నుంచి వస్తువులు దొంగతనానికి పాల్పడిన నిందితుడు నాగరాజు పట్టుకున్నారు. నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం అతడిని అరెస్టు చేశామన్నారు. విచారణ పూర్తయ్యాక ఎల్లారెడ్డి కోర్టులో హాజరుపరచగా..మెజిస్ట్రేట్ నిందితుడికి రిమాండ్ విధించారు. గత నెలలో ఎల్లారెడ్డి మండల కేంద్రంలో దొంగతనాలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి దొంగతనానికి పాల్పడిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్సై మహేష్ మాట్లాడుతూ..ఎల్లారెడ్డి పట్టణంలో జరుగుతున్న దొంగతనాల పట్ల ప్రత్యేక నిఘా పెట్టమని తెలిపారు.

Advertisement

Next Story