Mallikarjun kharge : యోగి వేషాధారణపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-11-10 18:10:06.0  )
Mallikarjun kharge : యోగి వేషాధారణపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సెటైర్లు వేశారు. ఆయన పేరును ప్రస్తావించకుండానే కొంత మంది సాధువులుగా జీవించి పొలిటిషయన్స్ అయ్యారని.. మరికొంత మంది ముఖ్యమంత్రులు అయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోరఖ్‌నాథ్ మఠ్ పీఠాదిపతి కూడా అయిన యోగి ఆదిత్యనాథ్‌ను ఖర్గే టార్గెట్ చేశారు. ఆదివారం సంవిధాన్ బచావ్ సమ్మేళన్‌లో ఖర్గే మాట్లాడారు. ఇటీవల యోగి ‘బటోగే తో కటోగే’ అంటూ హిందూ యూనిటీ కోసం ఇచ్చిన స్లోగన్ ను తప్పుబట్టారు. యూపీ సీఎం విద్వేషాన్ని స్ర్పెడ్ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కొత్త స్లోగన్స్‌తో ముందుకు వస్తోందని.. ఈ దేశంలో ఏదైనా ప్రమాదం ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ- ఆర్ఎస్ఎస్ తోనే దేశానికి ప్రమాదం అన్నారు. బీజేపీ నేతలే ఉదయం నుంచి సాయంత్రం వరకు విభజించడం, చంపడం గురించి మాట్లాడతారని ఖర్గే ఘాటు విమర్శలు చేశారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసమే ఇందిరా గాంధీ అమరులయ్యారన్నారు. ప్రధాని మోడీపై కూడా ఖర్గే విరుచుకుపడ్డారు. పీఎం మీడియాతో ఇంట్రాక్ట్ కావడం లేదన్నారు. పాత కాలంలో ప్రభుత్వాధినేతలు ప్రతిపక్ష నేతలను కలిసేవారని.. ప్రధాని మాత్రం కనీసం మీడియా ప్రతినిధులను కూడా కలవడం లేదన్నారు. ఆదివారం ఆయన మహా వికాస్ అఘాడీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో చేర్చిన ఐదు గ్యారంటీలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయన్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 20న జరగనుండగా.. 23న కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. 288 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరగనుంది. మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటమిల మధ్య ప్రధానంగా పొలిటికల్ బ్యాటిల్ కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed