- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Inter Board : ఇంటర్ పరీక్షలకు సింసిద్ధత.. ఏర్పాట్లలో బోర్డు అధికారులు
దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్ పరీక్షల(Inter Exams)కు బోర్డు అధికారులు(Board Officers) సంసిద్ధమవుతుతున్నారు. ప్రశ్న పత్రాల(Questions Papers) తయారీ ప్రక్రియను ప్రారంభించారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఇంటర్ బోర్డు అధికారులు ప్రక్రియను క్రమంగా వేగవంతం చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈసారి మరాఠీ(Marati), హిందీ(Hindi) మీడియం(Medium) ప్రశ్నపత్రాలను మ్యాన్యుయల్ పద్ధతిలో కాకుండా ముద్రించాలని బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈసారి చేతి రాతతో ప్రశ్నపత్రాలను అందించడం కాకుండా ముద్రణ చేసి ఇవ్వాలని నిర్ణయించారు. అందులోభాగంగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఎట్టకేలకు గతంలో ఉన్న పాత విధానాలకు స్వస్తి చెప్పనున్నారు. మరాఠీ మీడియంలో సుమారు 300 మంది వరకు ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. అలాగే హిందీ మీడియంలో దాదాపు 100 మందికి పైగా చదువుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కాగా ఇప్పటివరకు మరాఠీ, హిందీ మీడియంలో రాసే విద్యార్థులకు చేతి రాతతో తయారు చేసిన ప్రశ్న పత్రాలను అందించేవారు. కానీ, ఈ విద్యాసంవత్సరం నుంచి ఆయా మీడియం విద్యార్థులకు ఇతర మీడియం విద్యార్థుల మాదిరిగానే ప్రింటింగ్ చేసిన ప్రశ్న పత్రాలు ఇవ్వనున్నారు. దీనికి అనుగుణంగా ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కన్నడ మాధ్యమంలో దాదాపు 50 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే కొద్ది మంది మాత్రమే ఉన్నా ఆ విద్యార్థులకు ప్రశ్నపత్రాలను ముద్రించి ఇస్తున్నారు. దీంతో సమాలోచనలు చేసిన అధికారులు ఈసారి హిందీ, మరాఠీ ప్రశ్నపత్రాలను కూడా ముద్రించేందుకు సిద్థమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇంటర్ విద్యార్థులకు రెండోసారి పరీక్షలు జరగనున్నాయి. కాగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను జరగకుండా చేయాలని గతేడాదే పటిష్ట చర్యలు చేట్టింది. ఈసారి కూడా ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయింది. అందుకే పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించించింది. దీంతో బోర్డు అధికారులు ప్రశ్న పత్రం తయారీలో నిమగ్నమైంది.