- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vistara Airline: పదవీ విరమణ వయస్సుపై ఎయిర్ ఇండియా పైలట్‌ల అసంతృప్తి
దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ విస్తారాను ఎయిర్ఇండియా విలీనం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్ఇండియా పైలట్లు పదవీ విరమణ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థలకు చెందిన పైలట్లు వేర్వేరు పదవీ విరమణ వయో పరిమితులపై నిరాశగా ఉన్నారు. సోమవారం(నవంబర్ 11)న విలీన ప్రక్రియ జరగనున్న కారణంగా ఈ సమస్య పరిష్కరించకపోవడంపై పైలట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1950ల నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎయిర్ఇండియా సంస్థ 2022లో టాటా యాజమాన్యంలో చేరిన సంగతి తెలిసిందే. ఎయిర్ఇండియాలో పైలట్లు, ఇతర సిబ్బంది పదవీ విరమణ వయసు 58 ఏళ్లు కాగా, విస్తారాలో 60 ఏళ్లుగా ఉంది. దీంతో ఈ విషయంపై వివాదం కొనసాగుతోంది. విలీనం తర్వాత ఏకీకృత సంస్థలోని వారి పదవీ విరమణ వయసులో వ్యత్యాసం ఉండటంపై, దీని గురించి యాజమాన్యం సరైన కార్యాచరణ రూపొందించకపోవడంపై ఎయిర్ఇండియా పైలట్లలో ఓ వర్గం ఆగ్రహిస్తోంది. విలీనంలో భాగంగా ఇరు సంస్థల ఉద్యోగుల జీతాలు, ఇతర అంశాలపై స్పష్టత ఇచ్చినప్పటికీ, రిటైర్‌మెంట్ వయసు సమస్యను పరిష్కరించలేదు.