పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాలి.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..

by Sumithra |
పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాలి.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..
X

దిశ, గంగాధర : పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాలని, దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు, పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం మధురానగర్ గ్రామంలోని 5 వార్డులో శనివారం పారిశుద్ధ్య నిర్వహణను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా అమలు చేయాలని, గ్రామాల్లో తడి, పొడి చెత్త నిర్వహణ పై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామపంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ చెత్తను తొలగించి డంపు యార్డుకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు, పల్లెలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.

చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని, పనులు వెంటనే ప్రారంభించాలని పంచాయతీరాజ్ డి.ఈ ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గంగాధర సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, నాయకులు దాతు అంజి, వేముల అంజి, పెంచాల చందు, బైరిశెట్టి సంపత్, గంగాధర శ్రీకాంత్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed