- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరిసిల్లలో విజిలెన్స్ అధికారుల దాడులు
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయంలో రికార్డుల తనిఖీ నిర్వహించారు. ఇటీవల భర్తీ చేసిన రేషన్ డీలర్ దుకాణాల నియామకంలో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నియోజకవర్గ వ్యాప్తంగా భర్తీ చేసిన 58 రేషన్ డీలర్ దుకాణాలను కాంగ్రెస్ నేతలు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం కూడా విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలకు సంబంధించిన సమాచారం అత్యంత గోప్యంగా ఉంచారు. కాగా మళ్ళీ ఈరోజు సిరిసిల్ల ఆర్డిఓ కార్యాలయంలో రికార్డుల తనిఖీలు నిర్వహించడం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశం అయ్యింది. గతంలో చేసిన తనిఖీల్లో రేషన్ దుకాణాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వస్తేనే రెండవసారి వచ్చి పూర్తి స్థాయి విచారణ చేపట్టారనే భావన పలువురు వెలిబుచ్చుతున్నారు. కాగా పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారుల వరుస తనిఖీలు సిరిసిల్లలో కలకలం రేపుతున్నాయి.