- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిరిసిల్ల టెక్స్‌టైల్స్ పార్క్ ఒక్కరోజు బంద్.. కార్మికుల నిరసన దీక్ష
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ మరమగ్గాల కార్మికులు ఒక్కరోజు టెక్స్టైల్ పార్క్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం టెక్స్టైల్ పార్క్ గేటు ముందు సిఐటియు ఆధ్వర్యంలో పరిశ్రమలు మూసి కార్మికులు నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం టెక్స్టైల్ పార్కులో మూతపడ్డ పరిశ్రమలను వెంటనే తెరవాలని, పూర్తిస్థాయిలో పరిశ్రమలు ప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డర్లపైనే టెక్స్టైల్ పార్క్ కార్మికులు ఆధారపడి ఉన్నారని, ప్రభుత్వ శాఖలతో పాటు మిగతా శాఖల ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలని కోరారు.
2022, 23 సంవత్సరాలకు సంబంధించిన 10 శాతం యారన్ సబ్సిడీని కార్మికులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. టెక్స్టైల్ పార్కు యజమానులు, ఆ సాములు కార్మికులకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే యారన్ సబ్సిడీ డబ్బులను కార్మికుల ఖాతాల్లో జమ చేసి, సంవత్సరం పొడుగునా ఉపాధి కల్పించాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మరమగ్గాల కార్మికులు పాల్గొన్నారు.