- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MP Arvind : ఇళ్ల స్థలాలు వచ్చే వరకు వెన్నంటే ఉంటా
దిశ, జగిత్యాల టౌన్: ఇళ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 12 రోజులకు చేరుకుంది. బుధవారం దీక్షా శిబిరం ముందు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి రోడ్డుపైనే భోజనాలు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ హాజరై సంఘీభావం తెలిపారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పొందే వరకు వారి వెన్నంటే ఉంటానని హామీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఇళ్ల స్థలాల కోసం జగిత్యాల జర్నలిస్టుల డిమాండ్ వినిపిస్తుందన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీ నెరవేరకుండా కొంతమంది నాయకులు అడ్డుపడుతున్న సంగతి తెలిసిందేనని, ఈ పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. జర్నలిస్టుల న్యాయమైన కోరిక తీరే వరకు తాను వెన్నంటే ఉంటానన్నారు.
వెంటనే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని, తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడమే కాకుండా కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా కూడా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులకు ఇచ్చే రాయితీ రైల్వే పాసులను పునరుద్ధరించాలని ఎంపీ కి వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట బిజెపి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రావణి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కృష్ణ హరి తదితరులు పాల్గొన్నారు.