BRS : డైట్..మెస్ చార్జీల పెంపుపై కాంగ్రెస్ అసత్య ప్రచారం : బీఆర్ఎస్ ఎదురుదాడి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-02 07:20:42.0  )
BRS : డైట్..మెస్ చార్జీల పెంపుపై కాంగ్రెస్ అసత్య ప్రచారం : బీఆర్ఎస్ ఎదురుదాడి
X

దిశ, వెబ్ డెస్క్ : డైట్, మెస్ చార్జీ(diet..mess charges)లు 10% పెంచి 40% పెంచినట్టు కాంగ్రెస్(Congress) ప్రభుత్వం సిగ్గులేకుండా అబద్ధాలు ప్రచారం చేసుకుంటుందని బీఆర్ఎస్(BRS) పార్టీ ట్విటర్ వేదికగా విమర్శల దాడికి దిగింది. బీఆర్ఎస్ గతంలోనే మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక మేరకు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే డైట్ ఛార్జీలు 26శాతం పెరిగాయని బీఆర్ఎస్ పేర్కొంది. ఇందుకు సంబంధించి ఓ న్యూస్ చానెల్ వీడియో క్లిప్ ను జత చేసింది. డైట్ చార్జీల పెంపుతో అప్పట్లో 7.50లక్షల మందికి లబ్ధి చేకూరిందని, రాష్ట్ర ఖజానాపై నెలకు 237కోట్ల అదనపూ భారం పడిందని గుర్తు చేసింది. 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ. 950 నుంచి రూ.1,200 కు పెంచారని, 8 నుండి 10వ తరగతి రూ. 1,100 నుంచి రూ.1,400 కు పెంచారని, ఇంటర్‌ నుంచి పీజీ వరకు రూ.1,500 నుంచి రూ.1,875కి కేసీఆర్ పెంచారని బీఆర్ఎస్ తన ట్వీట్ లో వెల్లడించింది.

కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా డైట్ మెస్ చార్జీలను 40శాతం పెంచామని, తద్వారా 7,65,760మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని ప్రకటించింది. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం డైట్, మెస్ చార్జీల పెంపుపై నిర్లక్ష్యం వహించిందంటూ మంత్రులు విమర్శలు చేశారు. దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో డైట్ మెస్ చార్జీల పెంపు చేసిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా త్రిప్పికొట్టే ప్రయత్నం చేసింది.

Advertisement

Next Story

Most Viewed