- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Case On Namaste Telangana: ‘నమస్తే తెలంగాణ’పై కేసు.. ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు రైతుల ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో: తప్పుడు కథనాలతో తమకు నష్టం కలిగేలా చేశారని రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో నమస్తే తెలంగాణ దినపత్రిక (Namaste Telangana Paper) పై మీర్ పేట పోలీస్ స్టేషన్ (Meerpet Police Staion) లో కేసు నమోదు అయింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్ గూల్ గ్రామంలోని సర్వేనెంబర్ 92లో ఉన్న భూమికి సంబంధించి నమస్తే తెలంగాణలో అక్టోబర్ 31న 'బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్' (Big Brothers Land Pooling) శీర్షికన తమ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చామని తప్పుడు కథనం ప్రచురించారని ఫిర్యాదులో రైతులు పేర్కొన్నారు. లబ్ధిదారులమైన మేము మా భూమిని డెవలపర్స్ కు ఇవ్వడానికి అంగీకరించామని ఇందుకు గాను ఎకరాకు రూ.10 లక్షలతో పాటు అభివృద్ధి చేసిన వెయ్యి గజాల ప్లాటు చొప్పున ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నామని ఇందుకు సంబంధించిన ఫేక్ పోర్జరీ అగ్రిమెంట్లను సృష్టించి వాటిని దినపత్రికలో ప్రచురించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజానికి బీఆర్ఎస్ (BRS) హయాంలోనే హెచ్ఎండీఏ (HMDA) అధికారులు మా భూమిని తీసుకుని డెవలప్ చేస్తామని ఒప్పందానికి వచ్చారు. అందుకు ఒక ఎకరానికి 700 గజాల స్థలం కావాలని చర్చలు జరిపాం. అందుకు వారు అంగీకరించకపోవడంతో మా చర్చలు విఫలం అయ్యారు. దాంతో తిరిగి ఆ భూములను ఎవరికీ ఇవ్వకుండా మేము సాగుచేసుకుంటున్నాం. కానీ నమస్తే తెలంగాణ మాత్రం ఆ భూములను మేము ఇతరులకు ఇచ్చినట్లుగా తప్పుడు కథనాలు రాసిందని అందువల్ల తమకు నష్టం కలిగించేలా చేసిన నమస్తే తెలంగాణ ఎండీ, మేనేజ్మెంట్, ఎడిటర్ తో దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో BNS 319 (2), 338, 340(2), 353(2), 61 (2)(a) r/w 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.