- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాక్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం.. వ్యక్తి సజీవ దహనం...
దిశ, మల్యాల : షాక్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం అయిన ఘటన మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మ్యాడంపల్లి గ్రామానికి చెందిన గాతం తిరుపతి (42) అనే వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తనకు ఇద్దరు కుమారులు ఉండగా, తన భార్య కొడిమ్యాల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ కరీంనగర్ లో నివాసం ఉంటున్నారు. వ్యవసాయ పనులు మొదలు కావడంతో తన స్వగ్రామమైన మ్యాడంపల్లి గ్రామానికి వచ్చిన తిరుపతి పనులు పూర్తి చేసుకొని తన సొంత ఇంట్లో నిద్రిస్తున్నాడు.
ఇదే సమయంలో దాదాపు రాత్రి 12 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో చెలరేగిన మంటల్లో చిక్కుకొని వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించడంతో మంటలను పూర్తిగా ఆర్పివేసి మృతుని మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మల్యాల సీఐ నీలం రవి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహంను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.