- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్లో కలపొద్దు..
దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల ఎల్లమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్లో కలపొద్దని వెల్లుల్ల గ్రామస్తులు గురువారం మెట్పల్లిలోని నెహ్రూ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి దేవాలయం పై వచ్చిన ఆదాయంతోనే అభివృద్ధి చేశామని అన్నారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందిన ఎల్లమ్మ దేవాలయాన్ని నేడు ఓ ముగ్గురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎండోమెంట్ కలపడం పై మండిపడ్డారు. అధికారులు స్వాధీన పరుచుకోవడంతో గ్రామంలోని కొంతమందికి ఉపాధి కోల్పోతారని వెంటనే ఎండోమెంట్ లో కలిపిన జీవో వెంటనే వెనక్కి తీసుకోవాలని గో బ్యాక్ ఎండోమెంట్, జై ఎల్లమ్మ జై జై ఎల్లమ్మ, వద్దురా నాయన ఎండోమెంట్ పాలన అంటూ, నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి,( డీఏఓ) డివిజనల్ అడ్మినిస్ట్ ఆఫీసర్ వసంతలు, మీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో చాలా సేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.