Nara Lokesh:‘రాష్ట్రమే ఫస్ట్..ప్రజలే ఫైనల్’.. ఆరు నెలల పాలన పై మంత్రి లోకేష్ ఆసక్తికర ట్వీట్

by Jakkula Mamatha |
Nara Lokesh:‘రాష్ట్రమే ఫస్ట్..ప్రజలే ఫైనల్’.. ఆరు నెలల పాలన పై మంత్రి లోకేష్ ఆసక్తికర ట్వీట్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఏర్పడి ఆరు నెలలు అయ్యింది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) టీడీపీ కూటమి(TDP alliance) భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) రాష్ట్ర అభివృద్దే(State Development) లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(Government) అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ట్విట్టర్(Twitter) వేదికగా స్పందించారు.

ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్.. ‘‘రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయ్యింది. ఐదేళ్లలో విధ్వంసమైన రాష్ట్రం, అస్తవ్యస్తమైన వ్యవస్థలు, అప్పులు వారసత్వంగా వచ్చాయి. సంక్షోభాలను అవకాశాలుగా తీసుకొని సంక్షేమంగా మలిచే సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తోంది. పిచ్చి పిచ్చి రంగులు ఉండవు.. మా బొమ్మలు కనిపించవు.. పబ్లిసిటీ కంటే రియాలిటీ‌కే మా ప్రాధాన్యం. 'రాష్ట్రమే ఫస్ట్.. ప్రజలే ఫైనల్' అనే నినాదం కూటమి ప్రభుత్వ విధానంగా అమలు చేస్తూ ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. అందరి సహకారంతో స్వర్ణాంధ్ర - 2047 విజన్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తాం’’ అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story