గ్రూప్‌-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

by Naveena |
గ్రూప్‌-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
X

దిశ, కామారెడ్డి : ఈ నెల 15,16 తేదీల్లో జరుగనున్న గ్రూప్ 2 పరీక్షలను పకడ్బందీగా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు, రూట్ అధికారులు, ఐడెంటిఫికేషన్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఇంతవరకు జరిగిన గ్రూప్స్ పరీక్షలను విజయవంతం చేయడం జరిగాయని, ప్రస్తుతం జరుగనున్న గ్రూప్ 2 పరీక్షలను కూడా జాగ్రత్తగా, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అభ్యర్థులను వేగవంతంగా నిశితంగా పరిశీలన చేసి..పరీక్ష హాలులోకి పంపించాలని తెలిపారు. పరీక్షల నిర్వహణకు కేటాయించిన సిబ్బందిని వారి విధులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. శిక్షణ సమయంలో తెలిపిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకొని విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్.సి. ఒ. డాక్టర్ విజయ్ కుమార్, అడిషనల్ ఆర్.సి.ఒ. శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story