BWF World Tour Finals : పుంజుకున్న గాయత్రి జోడీ.. సెమీస్‌ రేసులోకి దూసుకొచ్చిన భారత జంట

by Harish |
BWF World Tour Finals : పుంజుకున్న గాయత్రి జోడీ.. సెమీస్‌ రేసులోకి దూసుకొచ్చిన భారత జంట
X

దిశ, స్పోర్ట్స్ : బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌ను ఓటమితో ప్రారంభించిన భారత మహిళల డబుల్స్ షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జోడీ టోర్నీలో పుంజుకుంది. ఈ జంట రెండో గ్రూపు మ్యాచ్‌లో విజయం సాధించింది. చైనాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో గాయత్రి జంట 21-19, 21-19 తేడాతో మలేసియాకు చెందిన పెర్లీ టాన్-తినాహ్ మురళీధరన్ ద్వయంపై పోరాడి గెలిచింది. 46 నిమిషాలపాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. మలేసియా ద్వయం నుంచి తీవ్ర పోటీ ఎదురైనప్పటికీ గాయత్రి, ట్రీసా జాలీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రెండు గేముల్లోనే మ్యాచ్‌ను ముగించింది.

ళఈ విజయంతో భారత జంట సెమీస్‌ ఆశలను సజీవం చేసుకుంది. గ్రూపు-ఏలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నది. నేడు ఆఖరిదైన మూడో గ్రూపు మ్యాచ్‌లో నామి మత్సుయామా-చిహారు షిదా(జపాన్) జంటతో తలపడనుంది. ఈ మ్యాచ్‌పైనే టోర్నీలో భారత ద్వయం భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. నెగ్గితే ఎలాంటి అడ్డంకులు లేకుండా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఓడితే మాత్రం ఇంటిదారిపట్టనుంది. ప్రతి గ్రూపులో టాప్-2 జంటలే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.


Advertisement

Next Story