సిరిసిల్లలో రోడ్డెక్కిన న్యాయవాదులు

by Aamani |
సిరిసిల్లలో  రోడ్డెక్కిన న్యాయవాదులు
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలో పోలీసు అధికారులు కోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ, కక్షిదారులు పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ సిరిసిల్లలో న్యాయవాదులు రోడ్డెక్కారు. గత ఐదు రోజుల నుంచి కోర్టు విధులలు బహిష్కరిస్తూ ఆందోళన బాట చేపట్టిన విషయం విదితమే. కాగా సోమవారం నిరసన కార్యక్రమంలో భాగంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తపరుస్తూ జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్ మీదుగా ప్రెస్ క్లబ్ వరకు న్యాయవాదులు పాదయాత్ర కొనసాగించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సివిల్ తగాదాల్లో కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన కూడ కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ కక్షిదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. న్యాయం చేయాల్సిన పోలీసులే ప్రజల హక్కులను కాల రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విషయమై జిల్లా ఎస్పీని కలిసేందుకు వెళ్లగా, కనీసం సమయం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజా న్యాయ హక్కులను సంరక్షించడానికి పాటుపడే న్యాయవాదులు గత ఐదు రోజుల నుండి ఆందోళన చేపడుతున్న పోలీసులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. విధుల బహిష్కరణ ఈ నెల 9 వరకు కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నాయ్యం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు దోర్నాల సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి తంగళ్ళపల్లి వెంకటి, క్యాషియర్ బిట్ల విష్ణు, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీ గుడ్ల కిషన్, లైబ్రరీ సెక్రటరీ శశాంకం, కోడి లక్ష్మణ్, ధర్మేందర్, ఆవునూరి రమాకాంత్, గోవింద్ భాస్కర్, సీనియర్ జూనియర్, మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed