సిరిసిల్ల చేనేత మగ్గంపై జనసేనాని దుస్తులు

by Aamani |
సిరిసిల్ల చేనేత మగ్గంపై జనసేనాని దుస్తులు
X

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల చేనేత మగ్గంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుస్తులు తయారయ్యాయి. సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ కు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ధరించే దుస్తులు తయారు చేసే అరుదైన అవకాశం లభించింది. గతంలో హరిప్రసాద్ చేనేత మగ్గంపై పవన్ కళ్యాణ్ చిత్రాన్ని జ్ఞాపికను తయారు చేసిన కలను చూసిన అమెరికాలోని అట్లాంటా కు చెందిన పవన్ అభిమాని, సుమారురూ. 6 లక్షల రూపాయల విలువగల వస్త్రాలను చేనేత మగ్గంపై తయారు చేయాలని హరి ప్రసాద్ కి ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ తీసుకున్న హరిప్రసాద్ దంపతులు దాదాపు 25 రోజులు శ్రమించి పవన్ కళ్యాణ్ ధరించే దుస్తులను తయారు చేశారు. పవన్ ధరించే చొక్కాపై జనసేన లోగో వచ్చేలా తయారు చేయడానికి ఆయనకు ఐదు రోజుల సమయం పట్టింది.

లోగో తయారీకి ఎరుపు, నలుపు రంగుల పట్టు దారం ఉపయోగించి, పూర్తిగా చేతులతో నేశాడు. 100 నెంబర్ కాటన్, లెనిన్ దారం లాడీలను ఉపయోగించి, పేక మాలును రాత్నం ఊసలపై చుట్టిన కండలతో తయారు చేసిన దారాలతో హరిప్రసాద్ మగ్గంపై వస్త్రాన్ని నేశాడు. ఒక చొక్కా తయారీకి మూడు మీటర్లు, ప్యాంటు తయారీకి రెండు మీటర్ల వస్త్రం ఉపయోగించాడు. పవన్ కళ్యాణ్ దుస్తుల తయారీకి తన అర్ధాంగి రేఖ పూర్తి సహకారాన్ని అందించింది. హరి ప్రసాద్ ప్రతి ఏటా చేనేత దినోత్సవానికి ఏదో విధంగా తన కలను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సంవత్సరం సిరిసిల్లలోనే మొట్టమొదటిసారిగా చేనేత మగ్గంపై లెనిన్ వస్త్రాల ఉత్పత్తి చేస్తున్నాడు. హరిప్రసాద్ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నేయడం చాలా సంతోషంగా ఉందని తనకు ఆర్డర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. అవకాశం ఇస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు చేనేత మగ్గంపై సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed