బంగారు చీర.. సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత ఆవిష్కరణ

by Aamani |
బంగారు చీర.. సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత ఆవిష్కరణ
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ 200 గ్రాముల బంగారం తో చీర తయారు చేశాడు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కూతురి వివాహ కోసం ఈ ఆర్డర్ ను ఆరు నెలల క్రితం తీసుకున్నాడు. బంగారాన్ని జరిపోవులుగా చేసి సరికొత్త డిజైన్ తో సుమారు 10 నుంచి 12 రోజులు కష్టపడి ఈ చీరను రూపొందించాడు. చీర వెడల్పు 49 ఇంచులు, పొడవు ఐదున్నర మీటర్లు, బరువు 800 నుంచి 900 గ్రాముల లోపల ఉండేలా నేశాడు. వచ్చే నెల 17న వ్యాపారవేత్త కూతురి పెళ్లి వివాహ కోసం నేసినట్లు, చీర తయారీకి రూ. 18 లక్షలు వెచ్చించినట్లు చేనేత కళాకారుడు నల్ల విజయ్ తెలిపాడు. చీర నేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని, తనలోని కలను మరోసారి చూపినందుకు ఎంతో గర్వ కారణంగా ఉందని ఆయన తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed