- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Karimnagar : సంతోష్ కుమార్ తీవ్ర అసంతృప్తి... బీఆర్ఎస్‌కు రాజీనామా
దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో అసంతృప్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలువురు సిట్టింగులకు సైతం మొండి చేయి చూపడంతో వారిలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. దీంతో బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. కొంతమంది నాయకులైతే ఇప్పటికే రాజీనామాలు చేశారు. తాజాగా ఈ కోవలోకి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ చేరిపోయారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించనున్నారు. భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
కాగా కరీంనగర్ బీఆర్ఎస్ నేతగా ఉన్న సంతోష్ కుమార్ .. 2019కు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని మండలిలో బీఆర్ఎస్‌లో విలీనం చేశారు. దీంతో ఆయన సైతం బీఆర్ఎస్‌లో చేరిపోయారు. అయితే సంతోష్ కుమార్ పార్టీ ఫిరాయించినప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో కొంతకాలంగా ఆయన మౌనంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అయినా తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారేమోనని ఎదురు చూసిన ఆయన బీఆర్ఎస్ లిస్టు ప్రకటించడంతో షాక్‌కు గురయ్యారు. దీంతో బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని అనుచరులు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అసంతృప్తుల సెగ తగలడంతో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది.