అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్ చేసిన బన్నీ భార్య.. ఆల్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ..

by Kavitha |
అరెస్ట్ తర్వాత తొలి పోస్ట్ చేసిన బన్నీ భార్య.. ఆల్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ..
X

దిశ, సినిమా: అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బన్నీని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక పాప, బాబుకు జన్మనిచ్చింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన భర్త, పిల్లలతో దిగిన ఫోటోలు, రకరకాల వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. బన్నీకి ఉన్న ఫ్యాన్సే ఈ భామకు కూడా ఉన్నారు అని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

రీసెంట్‌గా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్‌షోకి బన్నీ సంథ్యా థియేటర్ దగ్గరకి వచ్చినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా తన కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో అల్లు అర్జున్‌ని A11గా చేర్చి చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఇక బన్నీను ఇంటి దగ్గర నుంచి పోలీసులు తీసుకెళ్తున్న సమయంలో అల్లు స్నేహారెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోను కాగా బన్నీ ధైర్యం చెప్పి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత నెక్స్ట్ డే అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కూడా తన భార్య పరిగెత్తుకుంటూ వెళ్లి బన్నీని హగ్ చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ కూడా అయ్యాయి. అయితే ఈ బ్యూటీ అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఏ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఈ క్రమంలో తాజాగా ఈ అమ్మడు తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.

‘ఆల్ ది డిసెంబర్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్’ అంటూ తన పిల్లలు అయాన్, అర్హతో బన్నీ ఆడుకుంటున్న పిక్స్‌తో పాటు ఆమె సెల్ఫీస్ కూడా పోస్ట్ చేసింది. ఇక అరెస్ట్ తర్వాత ఆమె చేసిన తొలి పోస్ట్ కావడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ భామ పోస్ట్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

Advertisement

Next Story

Most Viewed