Yuzvendra Chahal: ధనశ్రీ తో విడాకుల పై మొదటిసారి స్పందించిన చాహల్

by Prasanna |
Yuzvendra Chahal: ధనశ్రీ తో  విడాకుల పై మొదటిసారి స్పందించిన చాహల్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) , అతని భార్య ధనశ్రీ ( Dhanashree Verma ) వర్మలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఈ లవ్లీ కపుల్ అతి త్వరలో డివోర్స్ తీసుకోబోతున్నారంటూ గత కొంత కలం నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు, వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ఎక్కడా కనిపించలేదు. అలాగే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, చాహల్ తన భార్యతో ఉన్న అన్ని ఫోటోలను డిలీట్ చేయడం వంటివి ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, వీరి విడాకుల ఇంత వరకు ఎవరూ స్పందించలేదు.

చాహల్, ధనశ్రీ వివాహం 2020లో వైభవంగా జరిగింది. అయితే, కొంతకాలం నుంచి వీరిద్దరూ కలిసి ఎక్కడా కనిపించకపోవడంతో డివోర్స్ అయిపోయి ఉంటాయని చాలా మంది అనుకున్నారు. తాజాగా, యుజ్వేంద్ర చాహల్ ఈ వార్తలపై ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటిసారి స్పందించాడు. " నిశ్శబ్దం లోతైన స్వరం, అన్ని శబ్దాల కంటే, ఎక్కువగా వినబడుతోంది" అంటూ ఇన్‌స్టా లో స్టోరీ పెట్టాడు. చాహల్ చేసిన ఈ పోస్ట్ పై రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఇటీవలే విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ అయిపొయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed