దారుణం.. కన్న తల్లిని ప్రియుడితో కలిసి హత్య చేసిన కూతురు

by Mahesh |   ( Updated:2025-01-08 05:51:55.0  )
దారుణం.. కన్న తల్లిని ప్రియుడితో కలిసి హత్య చేసిన కూతురు
X

దిశ, వెబ్ డెస్క్: కన్న తల్లిని అతి దారుణంగా ప్రేమికుడితో కలిసి కూతురు హత్య(Murder) చేసింది. ఈ ఘోరమైన సంఘటన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా(NTR Distt)లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన జీవ మణి అనే యువతికి నాగూర్ వలీ అనే యువకుడితో నాలుగు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడగా.. అదికాస్త ప్రేమగా మారింది. ఇది గమణించిన తల్లి ఎస్తేర్ కూతురుని పలుమార్లు మందలించింది. అప్పటికే యువతిజీవ మణికి మరోపెల్లికాగా.. తన వివాహేతర సంబంధానికి(extramarital affair) అడ్డుగా ఉందని.. కన్న తల్లిని ప్రియుడితో కలిసి హతమార్చాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి.. తల్లి ఎస్తేర్ తలపై కూతురు జీవ‌మణి సిమెంట్ రాయితో కొట్టి దారుణంగా హత్య(Murder) చేసింది. అనంతరం ఇద్దరు అక్కడి నుంచి పారిపోగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులైన నాగూర్ వలీ, జీవమణీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed