- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
School Holiday: రాష్ట్రానికి నేడు ప్రధాని మోడీ రాక.. ఆ ప్రాంతంలో పాఠశాలలకు సెలవు
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఇవాళ విశాఖపట్నం (Vishakhapatnam)లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ కారణాలు దృష్ట్యా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (Greater Vishakha Municipal Corporation) పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్ మూతపడనున్నాయని జిల్లా విద్య అధికారి ప్రేమ్ కుమార్ (DEO Prem Kumar) పేర్కొన్నారు. బస్సుల కొరతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇవాళ హాలీడేకు ప్రత్యామ్నాయంగా మరో రోజు పాఠశాలను తెరవాలని ఆయా పాఠశాలల యాజమాన్యాలకు అధికారులు సూచించారు. విశాఖ (Vishakha) పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం రోడ్ షో (Road Show), బహిరంగ సభలో కూడా పాల్గొనున్నారు. ఈ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu)తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pavan Kalyan), పలువురు మంత్రులు పాల్గొననున్నారు.