18 కోట్ల పరిహారం పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి.. అడ్లూరి చొరవతో విడుదలైన పరిహారం

by Aamani |   ( Updated:2024-09-14 16:00:54.0  )
18 కోట్ల పరిహారం పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి.. అడ్లూరి చొరవతో విడుదలైన పరిహారం
X

దిశ, వెల్గటూర్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు లో నష్టపోయిన నిర్వాసితులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో చెగ్యామ్ నిర్వాసితుల పెండింగ్ పరిహారమైన రూ.18 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు నిర్వాసితులకు ధర్మారం మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా పరిహారం నిర్వాసితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రాజెక్టులో సర్వస్వం కోల్పోయిన 125 కుటుంబాలకు పరిహారం కోసం ఏళ్ల తరబడి నిరీక్షించారన్నారు. గత ప్రభుత్వం పరిహారం గురించి అసలే పట్టించుకోలేదని ఆరోపించారు.

నిర్వాసితుల పక్షాన పోరాడిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనతో పాటు ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్కను 18 సార్లు హైదరాబాద్ లో కలిసి చాకచక్యంగా సమస్య పరిష్కారానికి కృషి చేశారన్నారు. మరోవైపు మేజర్ సన్స్ కు ఇచ్చే పరిహారం గురించి త్వరలో పునరాలోచన చేస్తామని శ్రీధర్ బాబు నిర్వాసితులకు హామీ ఇచ్చారు. విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచనలతో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన గుండాటి జితేందర్ రెడ్డి, గోళ్ళ తిరుపతి, మద్దుల గోపాల్ రెడ్డి, శైలేందర్ రెడ్డి, రంగు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed