- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ హయాంలో గురుకులాల నిర్వీర్యం..: ధర్మపురి ఎమ్మెల్యే
దిశ,పెగడపల్లి : గత ప్రభుత్వ హయాంలో కనీస సౌకర్యాలు లేక గురుకులాలు నిర్వీర్యం అయ్యాయని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.గత సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక్క గురుకుల పాఠశాలకైనా సొంత భవనం నిర్మించాడా అని మండిపడ్డారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గురుకులాలను పట్టించుకున్న నాథుడే లేడు అని కానీ మా ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు డైట్,కాస్మొటిక్ చార్జీలను నలభై శాతం వరకు పెంచామని గుర్తు చేశారు.
నాడు ధర్మపురి ఎమ్మెల్యేగా,సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ఒక్క గురుకుల పాఠశాల కు స్వంత భవనం నిర్మించలేదని కానీ నేడు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో నియోజకవర్గం లో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణం మంజూరు అయిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల వరకు రుణ మాఫీ చేశామని సాంకేతిక కారణాల వల్ల కొందరికి మాఫీ కాకుంటే అవి కూడా త్వరలోనే మాఫీ అవుతాయని హామీ ఇచ్చారు.
ఆరు గ్యారంటీ లను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా పాలన సాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల నాలుగో తేదీన పెద్దపల్లి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారని ఆ సభను నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలను తరలించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్,జిల్లా ఉపాధ్యక్షుడు ఒరుగలి శ్రీనివాస్, నాయకులు కడారి తిరుపతి,సంధి మల్లారెడ్డి, రవి నాయక్,అనిల్ గౌడ్, కుంచె రాజేందర్,మద్దెల సుధీర్,దికొండ మహేందర్ ,శ్రీరామ్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.