శ్రీ లలితాంబ దేవాలయం లో పచ్చని చెట్లు నరికివేత

by Kalyani |
శ్రీ లలితాంబ దేవాలయం లో పచ్చని చెట్లు నరికివేత
X

దిశ,చార్మినార్​ : పాతబస్తీ శ్రీ లలితాంబ దేవాలయంలో పరి శుభ్రత పేరిట పచ్చని చెట్లను నరకడం వివాదస్పదంగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న పచ్చని చెట్లను నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం పరి శుభ్రత పేరిట చెట్లను నరికివేయిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన భక్తులు ఎందుకు పచ్చని చెట్లను నరకుతున్నారని నిలదీయగా ఎండిన చెట్లను తొలగిస్తున్నామని పాలకవర్గం దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైన పిచ్చి మొక్కలు, ఎండిన చెట్లను నరికివేస్తారు గానీ పచ్చని చెట్లను నరకడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా ఆలయ ఈఓతో పాటు సంబంధిత అధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed