మంత్రి కేటీఆర్ కు దళితబంధు సెగ

by Shiva |
మంత్రి కేటీఆర్ కు దళితబంధు సెగ
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం మేజర్ పంచాయతీ కాగా, దళితబంధు కోసం మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీలో నివాసముంటున్న దళితులకు విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఎదుట నోటికి నల్లటి వస్త్రాలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

దళిత బంధు పేరిట ఓట్లు దండుకొవాలని పథకాన్ని ప్రవేశ పెట్టి తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో కొద్ది మందికి మాత్రమే సాయం అందజేస్తున్నారన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి పేట దళితులు బీఆర్ఎస్ కు ఓట్లు వేయలేదా అంటూ ప్రశ్నించారు. ఓట్లు వేస్తేనే కదా కేటీఆర్ ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి పదవి చేపట్టారని గుర్తు చేశారు. ఇదే మండలం లోనీ పదిర గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు కింద ఎంపిక చేసి ఆ ఊరిలో మాత్రమే దళితబంధు అమలు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు చెన్ని బాబు, వార్డు సభ్యులు ఎర్పుల శ్రీనివాస్, అందె వీరయ్య, బక్కి రవి, బద్ది దేవరాజు, మస్కురి దేవయ్య, ఏర్పుల తిరుపతి, బక్కి ఎల్లయ్య , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story