- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ నేతలవి మొసలి కన్నీరు
దిశ, కథలాపూర్ : బీఆర్ఎస్ నేతలవి మొసలి కన్నీరు అని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం కోరుట్ల నుండి జగిత్యాల వరకు చేపట్టిన పాదయాత్ర కేవలం వారి సొంత ప్రయోజనాల కోసమే తప్ప రైతుల పైన ప్రేమతో కాదన్నారు. 2018లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీష్ రావు కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ కు శిలాఫలకం వేసి కనీసం ఒక్క తట్టెడు మట్టి కూడా తీసిన పాపాన పోలేదన్నారు. అలాంటి మీరు ఏం ముఖం పెట్టుకొని పాదయాత్రలు చేస్తున్నారని ప్రవ్నించారు. ఆనాడే కథలాపూర్, మేడిపల్లి, కోరుట్ల రైతాంగానికి కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఇవ్వలేమని క్షమాపణలు చెప్పినట్లయితే స్వాగతించేవారమని అన్నారు.
అలాగే గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి రాళ్లవాగు ప్రాజెక్ట్ ను పూర్తిచేయని మీరు రైతుల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన రూ.6000 కోట్ల అప్పులకు రోజుకు రూ.181 కోట్ల మిత్తిని చెల్లిస్తున్నట్టు తెలిపారు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారన్నారు. కేటీఆర్ చెబుతున్న అమృత ప్రాజెక్ట్ లో భారీగా కుంభ కోణం జరిగిందని చెప్పడం విడ్డూరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాయితీ నాగరాజు, బ్లాక్ అధ్యక్షులు ఎండీ. అజీమ్, పీసీసీ కార్యవర్గ సభ్యులు తోట్ల అంజయ్య, మన్నెగూడెం తాజా మాజీ సర్పంచ్ నరేష్ రెడ్డి, అల్లూరి దేవా రెడ్డి, పులి హరిప్రసాద్, పుండ్ర నారాయణ రెడ్డి, తోట చౌదరి, అల్లకొండ విజయ్, వర్దినేని లింగా రావు, శ్రీనివాస్, గోపిడి ధనంజయ్ రెడ్డి, కూన శ్రీనివాస్, బోదాసు నర్సయ్య పాల్గొన్నారు.