శ్రీ గాయత్రి ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

by Shiva |
శ్రీ గాయత్రి ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
X

మహిళ కడుపులోంచి 6 కిలోల కణతిని తొలగించిన వైద్యురాలు సంధ్యారాణి

దిశ, మెట్ పల్లి : మల్లాపూర్ మండల పరిధిలోని రత్నాపూర్ గ్రామానికి చెందిన (20) యువతి గత కొంత కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో సదరు యువతి మెట్ పల్లి పట్టణంలోని శ్రీ గాయత్రి హాస్పిటల్ డాక్టర్ సంధ్యారాణిని సంప్రదించగా కడుపులో కంతి ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో మంగళవారం యువతికి శస్త్ర చికిత్స చేసి కడుపులో ఉన్న సుమారు 6 కిలోల కణతిని తొలగించారు. ఈ సందర్బంగా డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, శరీరంలో ఏవైనా మార్పులు కలిగినా, అసౌకర్యంగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఏ వ్యాధినైనా ప్రారంభ దశలోనే గుర్తిస్తే.. అందుకు సంబంధించి చికిత్స సులభతరం అవుతోందని తెలపారు. ఏమాత్రం అశ్రద్ధ వహించినా.. ప్రాణాలకే ప్రమాదమని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed