Jishnudev Varma: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణ స్వీకారం

by Prasad Jukanti |
Jishnudev Varma: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణ స్వీకారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జిష్ణు దేవ్ వర్మ చేత ప్రమాణం చేయించారు. బుధవారం సాయంత్రం రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతి కుమారి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీజే, కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు నూతన గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story