- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్కాజ్‌గిరి సీటుపై కన్నేసిన జనసేన.. బీజేపీతో చర్చలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు దాదాపు ఖరారు అయింది. అధికారికంగా ఇంకా ప్రకటన చేయకపోయినా.. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే పొత్తు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పవన్ భేటీ అవ్వగా.. తెలంగాణ ఎన్నికల్లో పొత్తులపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. తెలంగాణలో బీజేపీతో పొత్తుకు జనసేన సిద్దమవ్వగా.. సీట్ల సర్ధుబాటు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. జనసేన 30 సీట్లను ఆశిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో జనసేనకు బలం ఉండటంతో.. ఇక్కడ నుంచి ఎక్కువ సీట్లను ఆశిస్తోంది.
జనసేనకు సీట్ల కేటాయింపుపై ఇంకా చర్చలు నడుస్తున్నాయి. అయితే మల్కాజ్‌గిరి అసెంబ్లీ సీటును జనసేన ఆశిస్తోంది. కానీ బీజేపీలో కూడా మల్కాజ్‌గిరి సీటు కోసం భారీ పోటీ నెలకొంది. బీజేపీ నుంచి టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌తో పాటు జీకే కన్‌స్ట్రక్షన్స్ అధినేత జీకే హనుమంతరావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ పైరవీలు చేస్తోన్నారు. వీరిలో భాను ప్రకాష్, ఆకుల రాజేందర్ గట్టిగా టికెట్ కోసం అధిష్టానం దగ్గర లాబీయింగ్ చేస్తోన్నారు.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ద్వారా ఆకుల రాజేందర్ మల్కాజ్‌గిరి టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే జనసేన కూడా ఆ సీటుపై కన్నేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో పొత్తులో భాగంగా ఆ సీటు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.