ఎన్నికల్లో కూతురు పోటీపై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్.. కనీసం నువ్వైనా సిద్ధం కావాలంటూ పార్టీ నేత కూతురికి సూచన

by Disha Web Desk 13 |
ఎన్నికల్లో కూతురు పోటీపై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్.. కనీసం నువ్వైనా సిద్ధం కావాలంటూ పార్టీ నేత కూతురికి సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో:తన కూతురు జయారెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జయారెడ్డిని పొలిటికల్ గా లాంచ్ చేసేందుకు జగ్గారెడ్డి గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. 2018 ఎన్నికల్లో తన తండ్రి జగ్గారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన జయారెడ్డి.. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలోకి దిగబోతున్నారనే ప్రచారం పెద్దఎత్తున వినిపించింది. కానీ ఎం జరిగిందో ఏమో కానీ తిరిగి జగ్గారెడ్డినే బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. అయితే తాజాగా జయారెడ్డి పోటీ చేసే విషయంపై జగ్గారెడ్డి మరోసారి ఓపెన్ అయ్యారు.

శనివారం మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా గజ్వేల్ లో నిర్వహించిన ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన జగ్గారెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి కూతురు ఆంక్ష రెడ్డిని చూపిస్తూ ఆంక్ష రెడ్డి, తన కూతురు ఇద్దరూ యూత్ కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నారన్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని తన కూతురుకు చెబుతునప్పటికీ అందుకు ఆమె సిద్ధం కావడం లేదు. ఇప్పుడు ఆంక్ష రెడ్డిని అడుగుతున్నా నువ్వైనా పోటీకి సిద్ధం కావాలని సూచించారు. ఈ వ్యాఖ్యలతో భవిష్యత్ లో జయారెడ్డి, ఆంక్షా రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయం అనే చర్చ

Read More..

ఎవరికేం కావాలో అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటా.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Next Story

Most Viewed