పంచాయ‌తీ పనుల జాతరకు వేళాయే..!

by Shiva |   ( Updated:2024-11-21 15:56:42.0  )
పంచాయ‌తీ పనుల జాతరకు వేళాయే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలను అన్ని గ్రామ పంచాయతీలలో నిర్వహించాల‌ని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు నిర్ణయించింది. పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క ఆదేశాల మేర‌కు నవంబర్ 26న రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,750 కోట్ల నిధులతో వివిధ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నిధులతో ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా ద్వారా పశువుల పాకలు, కాంపోస్ట్ గుంతలు, కోళ్ల ఫారాలు, పొలం బాటలతో, వ్యవసాయ పొలాలకు బాటలు, నర్సరీలు, జలనిధి ద్వారా చెక్ డ్యాంలు, కుంటలు, గ్రామీణ మౌలిక వసతులైన సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీలు, మొదలగు పనులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ప్రారంభించాల‌ని ఆదేశించారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా గ్రామీణ రహదారుల నిర్మాణం సీఆర్ఆర్ నిధులతో పనులు ప్రారంభించనున్నారు. ఈ పనులను త్వరితగతిన ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభించి మార్చి 2025 నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ పనుల్లో ఎమ్మెల్యేలందరిని భాగస్వాములను చేయాలని నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed