పెట్టుబడులకు ముందుకు రావాలి.. మలేషియా మంత్రిని కోరిన తుమ్మల

by Shiva |
పెట్టుబడులకు ముందుకు రావాలి.. మలేషియా మంత్రిని కోరిన తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి మలేషియా కంపెనీలు ముందుకు రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కోరారు. మూడో రోజు శుక్రవారం మంత్రి పర్యటన కొనసాగింది. మలేషియా దేశ వ్యవసాయ శాఖ మంత్రి మహ్మద్ బిన్ సాబుతో భేటీ అయ్యారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ అగ్రి ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పడానికి సహకారం అందించాలని కోరారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో ఘనమైన వృద్ధిని సాధించామని, అధిక ప్రాధాన్యం వ్యవసాయానికి ఇస్తున్నామని, అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడానికి అనుకూల వాతావరణం ఉందన్నారు.

పెట్టుబడులకు మలేషియా సానుకూలంగా ఉందని మహ్మద్ బిన్ సాబు తెలిపారు. అనంతరం ఫెల్డా చైర్మన్ అహ్మద్ షబేరీ చీక్, ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు. ఆయిల్ ఫామ్ రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించి, తమ రాష్ట్ర ఆయిల్ ఫాం రైతులకు ప్రయోజనకరంగా ఉండే పద్దతులపై చర్చించారు. అదే విధంగా మలేషియాలో భారత హై కమిషన్ బీఎన్ రెడ్డి ఆహ్వానం మేరకు వారి ఆతిధ్యాన్ని స్వీకరించి, వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెనాషియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సందర్శించి, మెకనైజేషన్‌కు సంబంధించి అక్కడ వివిధ రకాల యంత్రాలు, పనిముట్లు, వాటి పని విధానాన్ని తుమ్మల అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వెర్టికల్ స్టెరిలైజర్, హారిజాంటల్ స్టెరిలైజర్ల వ్యత్యాసం కోసం టేనెర్ కంపెనీని మంత్రి బృందం పరిశీలించింది. పదేళ్ల క్రితం వెర్టికల్ స్టెరిలైజర్‌లో ఫామ్ గెలలను ఉడకబెట్టే పద్ధతిలో ఉన్న సమస్యల మార్పుతో అంతకు ముందు ఉన్న అవరోధాలు తొలగించి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వెర్టికల్ స్టెరిలైజర్‌లో ఓఈఆర్, ఇతర ప్రాసెసింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్న అంశాలను తెలుసుకున్నారు. వెర్టికల్ స్టెరిలైజర్‌లో రెగ్యులేట్ స్పీడ్‌‌లో మిల్ నడపడం, తక్కువ లేబర్, ఎక్కువ సేఫ్టీ మరియు తక్కువ ఖర్చులను కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఇప్పుడు కట్టే అన్నీ పామ్ ఆయిల్ మిల్స్‌లో వెర్టికల్ స్టెరిలైజర్‌ని మాత్రమే వాడుతున్నామని, రెండు పద్ధతుల్లో ఓఈఆర్ సరిసమానంగా ఉంటాయని టేనర్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed