Eatala Rajendar : గతంలో భారత్ అంటే చిన్న చూపు.. బీజేపీ ఎంపీ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh N |   ( Updated:2024-10-13 08:25:52.0  )
Eatala Rajendar : గతంలో భారత్ అంటే చిన్న చూపు.. బీజేపీ ఎంపీ ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో భారత్ అంటే చిన్న చూపు ఉండేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా నాగోల్ జీఎస్ఐ ఇన్స్టిట్యూట్‌లో రూప్ టాప్ సోలార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భారత్ వంటి దేశాలను థర్డ్ వరల్డ్ దేశాల కింద చూసేవారని గుర్తుచేశారు. అమెరికా, రష్యా లాంటి దేశాల సహకారం లేకుండా సొంతంగా అభివృద్ధి కాలేవనే భావన ఉండేదన్నారు.

ప్రపంచంలో ఏదైనా బ్యాంకులు సపోర్ట్ చేస్తే తప్ప ఈ దేశం అభివృద్ధి కాదేమోననే భావన ఉండేదని ఆవేదన వ్యక్తంచేశారు. 2014 ముందు పరిస్థితులు ఇలా ఉండేవని, కానీ ప్రధాని మోడీ పాలనలో కాదన్నారు. అతి తక్కువ కాలంలో తక్కువగా మాట్లాడి.. ప్రపంచంలోనే భారత్ ప్రతిష్టని, గొప్పతనాన్ని చాటి చెప్పిన వ్యక్తి ప్రధాని మోడీ అని కొనియాడారు. శాస్త్రవిజ్ఞాన ఫలాలు సమాజానికి అందించి.. ప్రపంచ చిత్ర పటంపై భారత్ ఔనిత్యం, గొప్పతనాన్ని చాటి చెప్పారని అన్నారు.

Read More : పట్నం నియామకం రాజ్యాంగ విరుద్ధం : హరీష్ రావు

Advertisement

Next Story

Most Viewed