- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పంచాయతీ కార్మికులకు బీమా
దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న మల్టీ పర్పస్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సౌకర్యాలను కల్పించింది. అనేక డిమాండ్లతో కొన్ని రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తుండడంతో ఆ శాఖ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. రైతులకు రైతుబీమాను అమలుచేస్తున్న తరహాలోనే పంచాయతీరాజ్ శాఖలోని మల్టీపర్పస్ వర్కర్లకు రూ.5 లక్షల బీమా పరిహారాన్ని అందించేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సాయం పొందడానికి అవసరమైన ప్రీమియంను గ్రామ పంచాయతీలే కార్మికుల పేరుతో జమ చేయాలని ఆ శాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకోవాలని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ఇది అమలయ్యేలా జిల్లా పంచాయతీ ఆఫీసర్లు చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు.
పంచాయతీ కార్మికులు దురదృష్టవశాత్తు చనిపోతే ఈ పాలసీ కింద మృతుల కుటుంబ సభ్యులకు ఈ సాయం అందుతుందని తెలిపారు. ఈ స్కీమ్‌లో కార్మికులంతా చేరేలా జిల్లా అధికారులు చొరవ తీసుకుని వారి పేర్లను నమోదు చేయాలన్నారు. మరోవైపు పంచాయతీ కార్మికులు చనిపోతే అంత్యక్రియల కోసం ప్రభుత్వం ఇంతకాలం ఆపద్బంధు స్కీమ్ కింద ఇస్తున్న రూ.5 వేల సాయాన్ని రూ.10 వేలకు పెంచుతూ ఉత్తర్వులను జారీచేశారు.