- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్ట్‌పై విచక్షణా రహితంగా దాడి
దిశ, ఇచ్చోడ : ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ వెంచ ర్ల పై వరుస కథనాలు రాస్తునందుకు ఓ పత్రిక జర్నలిస్ట్‌పై ఓ ప్రజాప్రతినిధితో పాటు పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి కలిసి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డ సంఘటన ఇచ్చోడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని నెలల నుంచి ఏజెన్సీ ప్రాంతమైన ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటవుతున్న అక్రమ లే అవుట్ల పై వాస్తవ నేస్తం సీఈవో, ఎండీ సయ్యద్ ఖమర్ వరుసగా కథనాలు రాశారు.
సోమవారం రాత్రి ఓ ఎలక్ట్రానిక్ రిపోర్టర్ పుత్రిక పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి ఇచ్చోడలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆ వేడుకల్లో ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, అతని అనుచరుడు మామిడి విజయ్ (హోమ్ గార్డు) ఉన్నారు. నేను.. ఏర్పాటు చేసిన వెంచర్ల పైనే వార్తలు రాస్తావా అంటూ స్థానిక ఎంపీపీతో పాటు అతని అనుచరుడు కలిసి బండ బూతులు తిడుతూ మూకుమ్మడిగా దాడి చేశారు. కడుపులో, ముఖం పై పిడిగుద్దులు గుద్దారు. జర్నలిస్టు కుటుంబ సభ్యుల పై సభ్య సమాజం తలదించుకునేలా బూతు మాటలు తిట్టాడు. అక్కడనే ఉన్న కొందరు జర్నలిస్టుల సహకారంతో అక్కడ నుండి సదరు దిన పత్రిక సీఈవో, ఎండీ బయట వచ్చి, జర్నలిస్టులతో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
వైరల్ అవుతున్న వీడియో..
జర్నలిస్టులు, జర్నలిస్టు కుటుంబ సభ్యులపై ఎంపీపీ, హోమ్ గార్డు కలిసి తిట్టిన బూతు మాటలను అక్కడనే ఉన్న కొందరు జర్నలిస్టులు సెల్ ఫోన్ లో వీడియో తీశారు. వీటిని వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేశారు. వేడుకల్లో పూటుగా మద్యం సేవించి, దాడి చేయడమే కాకుండా కుటుంబ సభ్యుల పై బండ బూతులు తిట్టడం, ఓ సామాజిక వర్గంను కించ పర్చేలా మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Tags
- Adilabad