- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు స్టేట్ సహకరించట్లే’
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టెక్స్ టైల్ పార్క్ కావాలని అడిగి ఇప్పుడు ముందుకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంఓయూ చేసుకునేందుకు కూడా ముందుకు రాకపోవడంపై ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోందని, ఎంఎస్పీ పెంచి రైతులకు మేలు చేసిందన్నారు.
వ్యవసాయ బడ్జెట్‌ను 5.7శాతం పెంచి రైతులకు లబ్ధి చేకూరుస్తోందని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా గణనీయంగా ఉత్పత్తి పెరిగిందని పేర్కొన్నారు. బియ్యం ఎగుమతుల్లో పురోగతి సాధించడంతో పాటు నూనె దిగుమతులను తగ్గించుకోగలిగామని చెప్పారు. వ్యవసాయానికి 20 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తో 33 శాతం పంటనష్టం జరిగినా పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకున్నామని, గతంలో ఇది 50 శాతానికి పైగా ఉంటేనే పరిహారం అందేదన్నారు.
వ్యవసాయ, అనుబంధ రంగాల అమ్మకాల కోసం లక్షకు పైగా ఈనాం మార్కెట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇథనాల్ ఉత్పత్తులు పెంచేందుకు ప్రోత్సాహకాలు పెంచినట్లు వెల్లడించారు. రైతుకు ఎకరానికి 26 వేలకు పైగా సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోందన్నారు. తెలంగాణలో ఆగిపోయిన 11ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.1400 కోట్లు కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈనెల 15వ తేదీన అమిత్ షా, 25వ తేదీన జేపీ నడ్డా తెలంగాణకు రాబోతున్నారని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ తెలంగాణ టూర్ పై క్లారిటీ రావాల్సి ఉందని, మరో రెండు, మూడ్రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని వెల్లడించారు.