- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఫోన్ పే’ బాబా! ఫీజు ఎంత వస్తే అంత కట్టాల్సిందే..
దిశ, డైనమిక్ బ్యూరో: తమ కుటుంబ సమస్యలను పరిష్కరిస్తామని సామాన్యులకు మాయమాటలు దొంగ బాబాలు చెప్పి డబ్బులు గుంజుతుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వరంగల్ జిల్లాలో ఓ దొంగ బాబా బాగోతం బయటపెట్టాడు ఓ భాదితుడు. అయితే, బాబాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ బాబాను నమ్మిన బాధిత వ్యక్తి వీడియోలో మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో ఓ బాబా దగ్గరికి వెళ్లామని చెప్పాడు. అయితే తను సూర్యాపేట నుంచి బాబా దగ్గరికి చేరుకోక ముందే.. ఆ స్వామిజీతో ఫోన్‌లో మాట్లాడానని, ఆ సమయంలో బాబా ఫోన్ పే లో రూ.1100 కొట్టాలని, అంత్రం వేసి చూస్తానని చెప్పినట్లు తెలిపాడు. ఆయన చెప్పిన విధంగా ఫోన్ పే చేసి తర్వాత రోజు బాబా దగ్గరకు వెళ్లనట్లు ఆ వ్యక్తి చెప్పాడు.
అయితే, బాబా దగ్గరకు వెళ్లి ముందు కూర్చున్న క్రమంలో పేపర్‌పై ఓ పెన్ను పెట్టి దానిపై పోడర్ చల్లి.. నీకు బాధలు ఉన్నాయని బాబా మొదలు పెట్టిండని చెప్పాడు. చివరికి నీకు ఎవరో చేతబడి చేశారు.. అని బాబా చెప్పాడని వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే మీకు రూ. 53 వేల ఫీజు వచ్చింది.. చేతబడిని తీయించుకోకపోతే ఇంకా అరిష్టం జరుగుతదని బాబా తమకు బెదిరించినట్లు వ్యక్తి చెప్పుకొచ్చాడు. దోష నివారణకు కచ్చితంగా ఆ ఫీజు కట్టాల్సిందేనని బాబా చెప్పారన్నారు. ఇన్ని పైసలు ఇచ్చుకోలేమో చూసి చెప్పండని వ్యక్తి బాబాను అడిగినట్లు చెప్పాడు. అయితే బాబా ఆలోచించి రూ. 40 వేల రూపాయలు ఇవ్వాలని, తక్షణమే రూ. 20 వేలు అడ్వాన్స్ ఇవ్వాలని బాబా డిమాండ్ చేసినట్లు ఆరోపించాడు. ఆ సమయంలో ఆ బాబా తనను మోసం చేస్తున్నాడని గుర్తించి.. వెంటనే తాను బయటకు వచ్చినట్లు చెప్పారు.
ఎంతో మంది అమాయకులను ఆ బాబా మోసం చేశాడని ఆ వ్యక్తి ఆరోపించాడు. చేతబడి లాంటి మాయమాటలు చెప్పి వేలకు వేలు బాబా సమాన్యుల వద్ద పైసలు వసూలు చేస్తున్న ఊతం మురళి లాంటి దొంగ బాబాపై చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను కోరాడు భాదిత వ్యక్తి. స్టేషన్ ఘన్‌పూర్‌లో పోలీస్ కమిషనర్ ఆఫీస్‌కు కూతవేటు దూరంలోనే దొంగ బాబా ఉంటాడని వివరాలు బాధిత వ్యక్తి వివరాలు వెల్లడించాడు. ఇలాంటి దొంగ బాబాలను అరెస్ట్ చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. అయితే, బాబా ‘ఫోన్ పే యాప్’ వాడుతున్న క్రమంలో పలువురు ఫోన్ పే బాబా, ఫీజు ఎంత వస్తే అంత కట్టాల్సిందే అంటూ సెటైర్లు వేస్తున్నారు.