- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ponnam: ఇకపై అలా చేస్తే లైసెన్సులు రద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : ట్రాఫిక్ ఉల్లంఘించిన వారి లైసెన్సులను రద్దు చేస్తామని, అయినా తీరుమార్చుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు(Traffic Ruls) పాటించాలని, ప్రతి ఒక్కరూ మరో ముగ్గురికి ట్రాఫిక్ నిబంధన గురించి చెప్పాలని సూచించారు. హైదరాబాద్ ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో(Transport Office) శుక్రవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. చిన్నప్పటినుండే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ సహకారంతో ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రజలందరికీ రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ విద్యాశాఖ అన్ని శాఖలు భాగస్వాములై ప్రజలను చైతన్యవంతులను చేసి సామాజికంగా ముందుకు వెళ్లాలన్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యూనిసెఫ్ సహకారంతో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం 500 నుంచి 1000 పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జనవరి 7న జాతీయ రోడ్డు రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చే జాతీయ రవాణా సమావేశం జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటివరకు 7000 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అనంతరం ఎలక్ట్రికల్ స్టేషను ప్రారంభించారు. తొలుత పాఠశాల విద్యార్థులతో కలసి రోడ్డు భద్రతపై ప్లకార్డులతో రోడ్డు భద్రత అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం రోడ్డు ప్రమాదం నివారిద్దాం పోస్టర్, కరపత్రాలను, రవాణా శాఖ క్యాలెండర్ ను,రవాణా శాఖ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ అసోసియేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జేటీసీలు రమేష్, మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, డీటీసీలు పుల్లెంల రవీందర్ గౌడ్, కిషన్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వ ప్రసాద్, కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాయకం శ్రీనివాస్, ప్రతీష్ రెడ్డి, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.