- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ హామీల నుంచి దృష్టి మళ్లించడానికే విగ్రహాల వివాదం: కేంద్ర మంత్రి బండి సంజయ్
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రదేశంలో కాంగ్రెస్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ విషయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా ఈ వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల నుంచి దృష్టి మళ్లించడానికే తెరపైకి ఈ వివాదం తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగా.. ప్రజల దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్, BRS సవాళ్లకు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అర్హులకు సరిగ్గా రుణమాఫీ లేక రైతులు సతమతం అవుతున్నారని.. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ రైతు రుణమాఫీ బోగస్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు.