- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: ఆయనకు మరింత అండదండలు అందించాలి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17 నుంచి హైదరాబాద్ జిల్లా బీజేపీ అధ్వర్యంలో ‘సేవా పక్షం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ అమీర్‌పేట్ ఎమ్‌సీహెచ్ గురుగోవింద్ స్టేడియంలో రక్తదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛభారత్, రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రధాని మోదీ అండతో కరోనాను సమర్థవంతం ఎదుర్కొన్నామని కిషన్ రెడ్డి చెప్పారు. ఉచితంగా వ్యాక్సిన్, ఆర్టికల్ 370 రద్దు, కొత్త విద్యా విధానం, జీఎస్టీ, ఉచిత బియ్యం, ఉగ్రవాద నిర్మూళన, జీ20 వంటి కార్యక్రమాలు లాంటి ఎన్నో చేపట్టామని చెప్పారు. ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా పాలన సాగిస్తున్నారని తెలిపారు. అలాంటి ప్రధానికి ప్రజలు మరింత అండదండలు అందించాలని అవసరం ఉందన్నారు. అక్టోబర్ 2న నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ అక్టోబర్ 1నే హైదరాబాద్ వస్తారని, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం పాలమూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేస్తారు.