డిసెంబర్ 3న కేసీఆర్‌ను ఓడగొడుతున్నాం: రేవంత్ రెడ్డి

by srinivas |   ( Updated:2023-11-30 13:16:21.0  )
డిసెంబర్ 3న కేసీఆర్‌ను ఓడగొడుతున్నాం: రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడగొడుతున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అమరవీరుడు శ్రీకాంతాచారి ప్రాణ త్యాగాన్ని గుర్తు చేశారు. శ్రీకాంతాచారి ప్రాణ త్యాగానికి ఎన్నికల తేదీకి ఒక లింక్ ఉందని రేవంత్ తెలిపారు. శ్రీకాంతాచారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తేదీ నవంబర్ 29 అని, ప్రాణ త్యాగం చేసిన తేదీ డిసెంబర్ 3 అని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం, యమధర్మ రాజుతో శ్రీకాంతాచారి హోరా హోరీగా పోరాటం చేశారని గుర్తు చేశారు. డిసెంబర్ 3 నాడు బీఆర్ఎస్ సర్కార్ కాలం ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. డిసెంబర్ 9న ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుందని తెలిపారు. ఓటమి ఎదురైనప్పుడల్లా కేసీఆర్ నియోజకవర్గం మారుస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమనే ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిబింబిస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story